వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. ఈరోజు దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిగి ఎమ్మెల్యే డీసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొకటి అమలు చేస్తుందని, ఉన్నత వర్గాల వారు తిన్నట్లె పేదలకు కూడా సన్నబియ్యం ఇవ్వలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు.అలాగే సన్నరకం వరి పండించిన రైతులకు 500 బొనస్ ఇస్తున్నామని రైతులు దళారులకు వడ్లు అమ్మి మోసపోవద్దని,ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


