వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :చత్తీస్గడ్ రాష్ట్రం ఊసూర్ బ్లాక్ కర్రెగుట్టలో నిన్న 22 ఏప్రిల్2025, పదివేల మంది సాయుధ పోలీస్ సైనిక బలగాలు చుట్టుముట్టి జరుపుతున్న కాల్పులను వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలకు సిద్ధము అని ప్రకటించిన మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని, కాల్పుల విరమణ ,ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని 24.ఏప్రిల్ 2025 తెలంగాణ ప్రజా ఫ్రంట్ మరియు ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఛత్తీస్గడ్ రాష్ట్రం మహారాష్ట్ర గడ్చిరోలి తెలంగాణ ఒడిస్సా రాష్ట్ర అటవీ ప్రాంతాల్లో చేపట్టిన ఆపరేషన్ కగారు నిలిపివేయాలని మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని గత కొన్ని రోజులుగా దేశంలోని మేధావులు, హక్కుల సంఘాలు ప్రజాస్వామికవాదులు, జర్నలిస్టులు రచయితలు, ఎడిటర్లు, రాజ్యాంగాన్ని ఐదవ షెడ్యూల్ ,ఆరవ షెడ్యూల్ పెసా చట్టాలను కాపాడుకోవాలని ఆదివాసి హననాన్ని ఆపి వేయాలని, మావోయిస్టు ఉద్యమకారులను హతమార్చడాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు..
మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ పాటించాలని కగార్ ఆపరేషన్ ఆపివేసి కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు విధి ఖరారు చేయాలని గతంలో లేఖ ద్వారా మరియు బస్తర్ టాకీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో నిన్న మావోయిస్టు పార్టీ ఉత్తర, పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జ్ రూపేష్ వెల్లడించినప్పటికి, నిన్నటి నుండి చత్తీస్గడ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట చుట్టూ పదివేల మంది సాయుధ పోలీసు బలగాలను హెలికాప్టర్లు, ద్రోణులను మోహరించి ఆదివాసులను మావోయిస్టులను హతమార్చే లక్ష్యంతో జరుగుతున్న ఈ దాడిని నిలిపివేయాలని శాంతి చర్చలు వెంటనే కొనసాగించాలని బలగాలను ఉపసంహరించుకోవాలని, కేంద్ర ప్రభుత్వాన్ని ,చత్తీస్గడ్ తెలంగాణ, మహారాష్ట్ర ,ఝార్ఖండ్ ఒడిషా రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలతో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఈ శాంతి చర్చలను మొదలు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే ప్రజాస్వామికవాదులు అభ్యుదయవాదులు మేధావులు కేంద్ర ప్రభుత్వాన్ని శాంతి చర్చలకు ఒప్పించడానికి తమ వంతు బాధ్యతగా స్పందించాల్సిందిగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
పాల్గొన్న వారు.
తెలంగాణ ప్రజా ఫ్రంట్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం
తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి విశ్వనాథం
తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


