ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Completed flyover awaits inauguration

ఫ్లైఓవర్ ప్రారంభం ఆలస్యం కారణంగా వరుస ప్రమాదాలు .. -ఇప్పటికే ఒకరు మృతి.

– దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

Completed Flyover : దేవరకొండ డివిజన్ జులై 18, త్రినేత్రం న్యూస్. మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్‌ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ విషయం తెలుసుకున్న దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కంచర్ల భూపాల్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు దేవరకొండ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచులు, పట్టణ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, పూర్తయిన మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్‌ను రాజకీయ కారణాలతో ప్రారంభించడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్లైఓవర్ ప్రారంభం ఆలస్యం కావడంతో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పానగల్ బైపాస్, మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్‌ల నిర్మాణాలకు రూ.50 కోట్లు మంజూరు చేసి, పనులను సుమారు 90 శాతం వరకు పూర్తి చేశామని తెలిపారు. ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.

అలాగే దేవరకొండ–డిండి రోడ్డు నుంచి మైనంపల్లి వరకు రహదారి అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 కోట్లు మంజూరు చేసిందని, అనంతరం నల్గొండలో మాజీ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి మీనాక్షి సెంటర్‌లో అదే పనులకు శంకుస్థాపన చేశారని, ఇప్పటికీ రోడ్డు పనులు పూర్తికాలేదని విమర్శించారు.

మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్‌ను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి, ప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page