జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో విధులు నిర్వహిస్తున్న నాయీబ్రాహ్మణులకు ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా వారి కనీస వేతనాన్ని రూ.20వేల నుంచి రూ.25వేలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచింది.

వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న నాయీబ్రాహ్మణులకు శుక్రవారం ఎమ్మెల్యే తన చేతుల మీదుగా పెరిగిన వేతన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, ముదునూరి వెంకటరాజు,ముళ్ళపూడి భాస్కరరావు, కాయల జగన్నాధం మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Satyananda Rao presented

You cannot copy content of this page