త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, వాడపల్లి. ప్రముఖ పుణ్యక్షేత్రం, కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతి వహించిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం నిర్మితమవుతున్న వకుళమాత అన్నదాన భవనం, పార్కింగ్ కేంద్రం, రహదారి నిర్మాణ పనులను శుక్రవారం కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు పరిశీలించారు. అభివృద్ధి పనులను సమీక్షించారు. ఎటువంటి లోపాలు తలెత్తకుండా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆలయ అధికారులకు సూచించారు.
ఆలయంలో జరుగుతున్న నిత్యాన్నదానాన్ని పరిశీలించారు. భక్తులకు లభిస్తున్న సౌకర్యాల గురించి, అన్నదానం ఏర్పాట్ల గురించి, భోజనం ఎలా ఉంది వంటి అంశాలను భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆలయ అధికారులను ఆదేశించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


