MLA Adireddy Srinivas : విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్న లోకేష్

TRINETHRAM NEWS

ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం సిఫార్సు లేఖలిచ్చే పరిస్థితి రావాలన్నది ధ్యేయం

పాలకుల బొమ్మలు లేకుండా నాణ్యమైన కిట్లు

నగరంలో మూడు స్కూల్స్ హైస్కూల్స్ గా అప్ గ్రేడ్ చేసాం

సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ల పంపిణీలో
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి,
రాజమహేంద్రవరం : ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే విధంగా విద్యావవ్యస్థలో సమూల మార్పులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు (వాసు) చెప్పారు. సిటిలో అప్ గ్రేడ్ అయిన అన్నపూర్ణమ్మపేట సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్, వి ఎల్ పురం శ్యామలాంబ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్, మోరంపూడి స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ ను శుక్రవారం ఉదయం ఆయన పంపిణీ చేసారు. ఆయా పాఠశాలల్లో అప్ గ్రేడ్ చేసిన తరగతి గదులను ప్రారంభించి ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రయివేటు పాఠశాలల్లో సీట్లకు సిఫార్సు లేఖల కోసం తల్లిదండ్రులు వస్తూ ఉంటారని గుర్తుచేసారు.

అయితే వచ్చే రెండు మూడేళ్ళలో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సీటు కోసం సిఫార్సు చేయమని తమ దగ్గరకు లేఖల కోసం వచ్చేలా విద్యావ్యవస్థలో మార్పులు రాబోతున్నాయని అన్నారు. ఆ దిశగా మంత్రి లోకేష్ మార్పులు తెస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఇచ్చిన విద్యాకిట్లకు ఇప్పటికీ ఎంతో తేడా ఉందని ఎమ్మెల్యే వాసు చెబుతూ, గతంలో జగనన్న బొమ్మలు ఉండేవని, ఇప్పుడు పాలకుల బొమ్మలు కాకుండా రాష్ట్రపతిగా చేసిన ఉపాధ్యాయుడైన డా సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతొ ఆయన బొమ్మ వేసి కిట్లు ఇప్పుడు ఇస్తున్నామని అన్నారు. గతంలో యూనిఫారంలు, బ్యాగులు ఏమాత్రం నాణ్యత లేకుండా ఉండేవని, ఇప్పుడు అత్యంత నాణ్యత గల బ్యాగులు, యూనిఫారంలు ఇస్తున్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. ఇక ఇప్పటివరకు పాఠశాల స్థాయిలోనే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తే, విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం ఉంటేనే బాగా చదువుతారని భావించి జూనియర్ కాలేజీల్లో కూడా మధ్యాహ్నం భోజన పథకం మంత్రి లోకేష్ ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు.

గతంలో జగనన్న గోరుముద్ద వంటి పేర్లతో పథకాలు పెడితే, కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరుతొ మధ్యాహ్నం భోజన పథకాన్ని అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మెల్యే వాసు హర్షద్వానాల మధ్య చెప్పారు. డొక్కా సీతమ్మ ఓపిక ఉన్నంతకాలం ఎవరు ఆకలితో వచ్చిన లేదనకుండా కాదనకుండా కడుపునిండా భోజనం పెట్టి పంపించిన డొక్కా సీతమ్మ దాతృత్వాన్ని గుర్తించి ఆనాటి బ్రిటిషు ప్రభుత్వం ప్రశంసించిందని అటువంటి మహనీయురాలి గురించి విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశ్యంతో ఈ పేరు పెట్టినట్లు ఆయన చెబుతూ ఇదీ కూటమి ప్రభుత్వ విశాలమైన ఆలోచనకు నిదర్శనమన్నారు. అలాగే సిటిలోని సీనియర్ నేషనల్ బేసిక్ స్కూల్, శ్యామలాంబ స్కూల్, మోరం పూడి స్కూల్స్ లో 8వ తరగతి వరకు మాత్రమే ఉండగా, తల్లిదండ్రుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని హైస్కూల్స్ గా మార్చాలని ప్రతిపాదన పంపిన వెంటనే ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు.

ఇక ఇన్నాళ్లూ భయపడుతూ వస్తున్న బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ల పని కూడా పడుతున్నామని, ఇప్పటికే చాలామందిని గుర్తించామని, ఇంకా ఎవరైనా ఉంటె తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు చేపడతామని, భయం లేకుండా స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెప్పారు. ఏవైనా తేడా వస్తే గతంలో ప్రశ్నించడానికి భయపడే పరిస్థితులు ఉండేవని ఇప్పుడు అలాంటిదేమీ ఉండదని, ఏ సమస్య వచ్చినా మీ శాసనసభ్యునిగా నేను ఉన్నానని అలాగే పైన ఒక పక్క ముఖ్యమంత్రి చందరాబు, మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకోపక్క మంత్రి లోకేష్ కూడా ప్రజల కోసమే అనుక్షణం ఆలోచిస్తూ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే వాసు చెప్పారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, మాలే విజయలక్ష్మి, చింతా జోగినాయుడు, పోలాకి పరమేష్, సనపతి సత్తిబాబు, కిలపర్తి నాగభూషణం, దాస్యం ప్రసాద్, బోను ఈశ్వరి, ఆడారి లక్ష్మీ నారాయణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lokesh is bringing radical

You cannot copy content of this page

Scroll to Top