రామగుండం మే-16//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ ఈరోజు మానవతా దృక్పథంతో మరోసారి సేవా కార్యక్రమంలో ముందుండి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ గాజుల కిరణ్ నేతృత్వంలోని ప్రాంతంలో నివసిస్తున్న గురిశెట్టి శంకర్, శ్యామల దంపతుల నిరుపేద కుటుంబానికి ఉచితంగా నివాస గృహ నిర్మాణం చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, “సమాజంలోని ప్రతి ఒక్కరికి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలి.
ఇల్లు అనేది ప్రతి మనిషి హక్కు. మనతో పాటు ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి అనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం” అన్నారు ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని మక్కన్ సింగ్ సేవా సమితి ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సనియర్ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్లు,సోషల్ మీడియా, వివిధ విభాగల అధ్యక్షులు తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


