రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం నియోజకవర్గా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గా నేడు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లో కలిసారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలపై రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారుఈ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యంగా పాలకుర్తి కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రస్తావించారు ఈ ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలోని పలువురు రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని, అలాగే వర్షాధారంగా మాత్రమే వ్యవసాయం చేసే ప్రాంతాల్లో పంటల ఉత్పత్తి స్థాయిలు గణనీయంగా పెరిగే అవకాశముందని వివరించారు ఇకపోతే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే ఉన్న సాగునీటి ప్రాజెక్టులు యథాస్థితిలో నిలిచిపోయినవని, వాటికి మరమ్మత్తులు, అభివృద్ధి పనులు అత్యవసరమని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
పాలకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టుతో పాటు, శనిగారం, మల్లెపల్లి, గోవిందపల్లి వంటి ప్రాంతాల్లో సాగునీటి అవసరాలపై కూడ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని వివరించారు ప్రజల జీవనోపాధికి వ్యవసాయం కీలకం కావడంతో ప్రభుత్వం దీన్ని ప్రాధాన్యతతో తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. సాగునీటి లభ్యత వల్ల స్థానిక రైతులు వలస బాట పడకుండా తమ సొంత గ్రామాల్లోనే జీవనోపాధి కొనసాగించగలరని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, రామగుండం నియోజకవర్గానికి సాగునీటి అవసరాలను ప్రభుత్వం గమనంలోకి తీసుకుందని, సంబంధిత అధికారులతో సంపూర్ణ వివరాలను సేకరించి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా పాలకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టు విషయంలో తక్షణమే టెక్నికల్ అధికారులతో సమీక్షించి, అవసరమైన నిధుల విడుదలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సమావేశంలో రామగుండం నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాల రైతు ప్రతినిధులు, స్థానిక నాయకులు కూడా ఎమ్మెల్యే తోడుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శరాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, “మా రైతుల సంక్షేమమే నా ప్రథమ లక్ష్యం. సాగునీటి సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచి, త్వరితంగా పరిష్కారం కాబడేలా చూస్తున్నాను. మంత్రి సానుకూల స్పందన ఆనందంగా ఉంది. ఇది మా నియోజకవర్గానికి ఎంతో సానుకూలమైన పరిణామం అవుతుంది” అని అన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయం అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం రామగుండం నియోజకవర్గానికి కూడ సకాలంలో సహాయ సహకారాలు అందిస్తుందని ఆశాభావం వ్యక్తమైంది వీరి వెంట పెద్దపల్లి జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పెండ్యాల మహేష్ తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


