MLA Raj Thakur : రామాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్

TRINETHRAM NEWS

ప్రత్యేక పూజలు చేసిన పార్టీ శ్రేణులు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం రామాంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి పరిశీలించారు.సందర్భంగా కొండపై ఇటీవల బయటపడిన ఆంజనేయస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఇదే స్థలంలో నిర్మాణం జరుగుతున్న 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. నిర్మాణం చేస్తున్న సదరు కాంట్రాక్టర్ ను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాముని కొండపై గతంలో బయటపడిన ధనుర్ భాణ ఆంజనేయస్వామి చిన్నపాటి విగ్రహం ప్రాంతంలోనే ఈ భారీ విగ్రహానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

నియోజకవర్గ ప్రజలు ఆధ్యాత్మిక చింతనలో ఉండాలన్నారు. అదేవిధంగా ఆంజనేయస్వామి దయతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలోనే భారీ విగ్రహం రాముని గుండాల గుట్టపై రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఇది తెలంగాణ ప్రాంతం లోనే ఆంజనేయ స్వామి విగ్రహం మణి మకుటం గా మారుతుందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Raj Thakur inspects

You cannot copy content of this page

Scroll to Top