Property Damage : అకాల వర్షాలతో ప్రజలకు ఆస్తి నష్టం ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :భారీ వర్షాలు ఈదురు గాలులతో అకాల వర్షాలు కురుస్తుండడంతో చెట్లు విరిగి రోడ్లపై పడి ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడమే కాకుండా ప్రజలపై పడి గాయాల పాలవుతున్నారని వికారాబాద్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కుమ్మరిపల్లి గోపాల్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లోని కలెక్టరేట్ పరిపాలన అధికారికి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పురాతనమైన చెట్లు రోడ్ల పక్కన ఉంటే రోడ్డుపైన పడవకుండా ఉండేలా వాటిని తొలగించి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా పట్టణంలో కానీ ఎక్కడైనా ప్రమాదకరంగా విద్యుత్ తీగల దగ్గర చెట్ల కొమ్మలు ఉంటే తొలగించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

చిన్న పార్టీ వర్షాలు వచ్చినా విద్యుత్ పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అలా కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా వికారాబాద్ నుండి సదాశివపేట నవాబుపేట్ వెళ్లే రహదారుల్లో రోడ్ల పైన చెట్లు పడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని వాటిని తొలగించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వికారాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో కూడా పాత పురాతనమైనటువంటి మర్రి చెట్లు మొదలగు వృక్షాలు ఉండడంతో అవి విరిగిపడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

హైదరాబాద్ వెళ్లే మార్గంలో చేవెళ్ల సమీపంలో ఓ మర్రిచెట్టు విరిగిపడి వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నర్సింలు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుందన్నారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ జనరల్ సెక్రెటరీ గాండ్ల మల్లికార్జున్ బిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సీనియర్ నాయకులు దేవదాస్ మల్లేశం బంట్వారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Measures should be taken

You cannot copy content of this page

Scroll to Top