గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు రూ.10 వేల పించన్ ఇవ్వాలంటూ పార్లమెంట్ లో మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి కార్మికుల పెన్షన్ కోసం ఇప్పటికే ప్రతి టన్ను బొగ్గుపై సింగరేణి మేనేజ్ మెంట్ ట్రస్ట్ బోర్డుకు రూ.10 చెల్లిస్తుండగా, పార్లమెంటులో కొట్లాడి ప్రతి టన్ను బొగ్గుపై మరో రూ.10 చెల్లించేలా ఎంపీ కృషి చేశారన్నారు. ప్రస్తుతం ప్రతి టన్ను బొగ్గుపై మొత్తం రూ.20 చొప్పున రూ.140 కోట్ల నిధులు ట్రస్ట్ బోర్డు కు కేటాయించనున్నారన్నారు. దివంగత కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పించన్ పథకం ప్రారంభించారన్నారు.
దశాబ్దాలుగా సింగరేణి రిటైర్డ్ కార్మికుల పించన్లో ఎలాంటి మార్పు లేదన్నారు. రూ.1000, రూ. 2000 పించన్ తో రిటైర్డ్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎంపీ వంశీకృష్ణ రిటైర్డ్ కార్మికులకు రూ. 10 వేల పించన్ వచ్చేదాక పోరాడుతారన్నారు. కామ విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లీడర్లు రాచకొండ కోటేశ్వర్లు, మల్లేష్ యాదవ్, తిప్పారపు మధు, కోరం నరేందర్ రెడ్డి, జావిద్, సంపత్, మహేష్, రాకేష్, వినోద్, రవి, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


