Financial Assistance : బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు.

ప్రభుత్వం నుంచి అన్నివిధాల సహాయ సహకారాలు.
-ఎం ఎల్ ఏ బాలు నాయక్.

దేవరకొండ -( పి ఎ పల్లి) సెప్టెంబర్ 19 త్రినేత్రం న్యూస్. గత 8 సంవత్సరాల క్రితం ఏ కే బి ఆర్ ప్రాజెక్ట్ కాలువలో ప్రమాదవశాత్తులో పడి మృతి చెందిన పిఎ పల్లి మండలంలోని వద్దిపట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పడమటి తండా కు చెందిన 09 మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి మంజూరు అయిన చెక్కులను ఎం ఎల్ ఏ బాలు నాయక్ పంపిణీ చేసారు. బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల ఇచ్చి ప్రభుత్వం నుంచి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ డీ ఓ రమణా రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి,తెర సత్యం రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్య నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్, మాజీ సర్పంచ్ జబ్బర్ లాల్, సీతారాం,అయ్యన్న యాదవ్, యువ నాయకులు శ్రీరామ్ నాయక్,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA provides government financial assistance

You cannot copy content of this page

Scroll to Top