MLA Balu Naik : నియోజకవర్గ ప్రజల నమ్మకానికి తగినవిధంగా అభివృద్ది

TRINETHRAM NEWS

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు.
-ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం మా ప్రధాన లక్ష్యం-

ఎం ఎల్ ఏ బాలు నాయక్.

దేవరకొండ సెప్టెంబర్ 19 త్రినేత్రం న్యూస్. దేవరకొండ* మండలంలోని మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీ పరిధిలో “జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్” కార్యక్రమంలో భాగంగా వివిధ కాలనీలో ప్రజా ప్రతినిధులు,అన్ని శాఖల అధికారులతో కలసి పర్యటించి,గ్రామ ప్రజలకు నేరుగా కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని అక్కడిక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పరిష్కరించారు.నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం మా ప్రధాన లక్ష్యం అని అన్నారు.నియోజకవర్గ ప్రజల నమ్మకానికి తగిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ముందుకు సాగుతున్నాను.మర్రిచెట్టు తండా గ్రామ పంచాయతీలో అండర్ డ్రైనేజీలు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు త్వరలో మంజూరు చేస్తానని,మర్రిచెట్టు తండా నుండి బుడ్డ తండా మధ్య వరద ప్రవాహం ద్వారా రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తండా ప్రజల కోసం 1.70 లక్షల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Development worthy of the trust

You cannot copy content of this page

Scroll to Top