దేవరకొండ డివిజన్ జనవరి 13 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని జెడ్పీ హైస్కూల్, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన దేవరకొండ యువ నాయకులు నేనావత్ అభిలాష్ నాయక్ ట్రోఫీ కబడ్డీ, క్రికెట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని, విజేత బహుమతులను ప్రజా ప్రతినిధులు, క్రీడా నిర్వాహకులు మరియు కుటుంబ సమేతంగా కలిసి ప్రథమ,ద్వితీయ బహుమతులను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. అందజేశారు.
దేవరకొండ నియోజకవర్గంలోని గిరిజన ప్రాంత క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, విజేత జట్లకు బహుమతులు ప్రదానం చేశారు.
గత వారం రోజులుగా ఉత్సాహభరితంగా కొనసాగిన టోర్నమెంట్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన జట్లను ఎమ్మెల్యే బాలు నాయక్ అభినందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


