దేవరకొండ డివిజన్ నవంబర్ 21 త్రినేత్రం న్యూస్. ప్రపంచ మత్స్య కారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కొండమల్లెపల్లి మండలం పెండ్లిపాకల గ్రామంలో నేడు మత్స్య శాఖ నల్లగొండ వారి ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలునాయక్ గంగా పూజ నిర్వహించి, అనంతరం చెరువులో చేపపిల్లలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ —
ప్రపంచ మత్స్య కారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్య కారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పెండ్లిపాకల చెరువులో మొత్తం 9 లక్షల చేపపిల్లలను విడుదల చేసినట్లు తెలిపారు. మత్స్య కారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, చేపల సంపదను పెంపొందించి వారి ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా పలు పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులలో ఒక కోటి 30 లక్షల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పెండ్లిపాకల చెరువు రొయ్యల పెంపకానికి అనువైనది కావడంతో ఈ ఏడాది రొయ్య పిల్లలను కూడా విడదల చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ ఏడి రాజారాం, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమునా మాధవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, టీపీసీసీ సభ్యులు డా. వేణుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రేఖా శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు వేమన్ రెడ్డి, నాయకులు యుగంధర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, యాదగిరి, కాసర్ల వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్ శక్రు నాయక్, జిల్లా సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


