
MLA Nenavath Balu : కొండ మల్లేపల్లి జులై 08, త్రినేత్రం న్యూస్.. కొండమల్లెపల్లి మండల కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్, కొండమల్లెపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ రిటైల్ ఔట్‌లెట్ ను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఒకేచోట అందుబాటులో ఉండే విధంగా సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్లు సకాలంలో అందించి వారి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత, దేవరకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, నల్లగొండ పార్లమెంటు కోఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, పీఎసీఎస్ చైర్మన్ డా. దూదిపాల వేణుధర్ రెడ్డి, సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ దూదిపాల శ్రీధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాసర్ల వెంకటేశ్వర్లు, మాజీ మండల అధ్యక్షులు ఊట్కూరి వేమన్ రెడ్డి, సర్పంచ్ పసునూరి యుగేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe