ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
MLA Nenavat Balu Naik

దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

MLA Nenavat Balu Naik : డిండి(గుండ్ల పల్లి), జూలై 24: త్రినేత్రం న్యూస్ : ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే ప్రాణమని, అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.

డిండి పట్టణం మరియు చెర్కుపల్లి గ్రామాల పరిధిలోని బూతులలో విధులు నిర్వహిస్తున్న బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై ఎమ్మెల్యే బాలు నాయక్ శుక్రవారం డిండి మండల కేంద్రంలో సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు, ఓటు అనేది కేవలం ఒక హక్కు మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును నిర్ణయించే రాజ్యాంగబద్ధమైన బాధ్యత కూడా అని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలడని తెలిపారు.

SIR ప్రక్రియలో నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఇంటిని సందర్శించి, ప్రతి ఓటరును పరిశీలించి, అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో నిర్ధారించాలని సూచించారు. ఎవరైనా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయినట్లయితే వెంటనే గుర్తించి, అవసరమైన దరఖాస్తులు పూర్తి చేయించి తిరిగి ఓటరు జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, జిల్లా నాయకులు , పార్టీ ముఖ్య నాయకులు ,డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, యువజన కాంగ్రెస్ నాయకులు, BLOలు, BLAలు, అధికసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page