రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ విద్యార్థుల అభివృద్ధి కోసం ఆధునిక సాంకేతికతను అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు 50కోట్ల వ్యాయంతో ఈ ఏటీసీ సెంటర్ ని ప్రారంభించామని ఈ సెంటర్ ద్వారా స్థానిక యువతకు నూతన అవకాశాలు లభిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ప్రత్యేకంగా ఐటీ, స్కిల్ డెవలప్మెంట్, రోబోటిక్స్ వంటి రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ సెంటర్ రామగుండం ప్రాంతానికి మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ఈ కేంద్రం ఉపయోగపడనుందనీ తెలిపారు ప్రారంభం సందర్భంగా విద్యార్థులు, స్థానికులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు కృతజ్ఞతలు తెలిపారు.తాజా సాంకేతిక పరిజ్ఞానం అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు రామగుండంలో అభివృద్ధి దిశగా మరో అడుగుగా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిలవనుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


