Korukanti Chander : దుర్గా మాత దీవెనలు ప్రజల పై ఉండాలి అని చండీ హోమం

TRINETHRAM NEWS

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని జవహర్ నగర్ లో శ్రీ జయ దుర్గా దేవి ఆలయంలో శనివారం శరన్నవరాత్రి ఉత్సవాల్లో చండీ హోమం కార్యక్రమాన్ని మాజీ మంత్రి వర్యులు కోప్పుల ఈశ్వర్ సెహ్నలత దంపతులు నిర్వహించారు.వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నియోజకవర్గ ప్రజలు భక్తులు నియమ నిష్ఠలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు అనంతరం పలువురు భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త వేణు మలాని, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, పెంట రాజేష్ కౌశిక్ హరి,బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chandi Homam says blessings of Goddess Durga

You cannot copy content of this page

Scroll to Top