కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 13 : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గంలోని గత నాలుగు రోజుల నుంచి ప్రతి డివిజన్లోని అభివృద్ధి కార్యక్రమాలపై పరిశీలన చేస్తున్నారు.ఈ నేపథ్యంలో శుక్రవారం మూసపేట్ డివిజన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పై పరిశీలన కొరకు ముందుగా మైసమ్మ చెరువు ప్రాంతాన్ని పరిశీలించి చెరువు వద్ద నాల నిర్మాణం చేసేటప్పుడు రిటర్నింగ్ వాల్ ఎత్తు పెంచి దానిమీద బ్రిడ్జి నిర్మాణం చేయాలని అలాగే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం వార్డ్ ఆఫీసు నందు నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కాలనీలో నెలకొన్న పలు సమస్యలపై వినతి పత్రం అందించారు.ముఖ్యంగా కబీర్ నగర్ నాల కు సంబంధించి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి దానిపై స్లాబ్ నిర్మించాలని అధికారులకు సూచించారు. బాలాజీ స్వర్ణపురి కాలనీలో పక్క కాలనీ వాళ్లు డ్రైనేజ్ ఆపడం వల్ల ఇబ్బంది అవుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకురాగా, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని లేనియెడల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నీటి ప్రెజర్ సరిగ్గా రావడంలేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి తెలపగ, కూకట్పల్లి నియోజకవర్గంలోని ఎట్టి పరిస్థితుల్లో నీటి సమస్య రాకూడదని లక్షల గ్యాలన్లతో ఎక్కడికక్కడ నీటి ట్యాంకులు నిర్మించుకున్నామని అయినా కూడా నీటి ఇబ్బంది తలెత్తడాన్ని సహించేది లేదని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీటి ప్రెజర్ పెంచాలని అధికారులకు తెలిపారు.
ముఖ్యంగా వీధిలైట్లు సమస్యను ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా ఈ సమస్య అతి త్వరలోనే పరిష్కరిస్తామని నియోజకవర్గమంతా కూడా వీధిలైట్లు సమస్య ఉందని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నామని తెలిపారు. అలాగే ప్రజల అందించిన సమస్యలను అక్కడ అధికారులకు ఇచ్చి వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని, తిరిగి మళ్ళీ సమీక్ష సమావేశంలో ఈ పనులు పూర్తయ్యలా చూడాలని అధికారులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ అన్ని విభాగాల అధికారులు డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


