MLA KP Vivekanand : రద్దయిన పనులను సభలో పెట్టడంలో హైదరాబాద్ నగరంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతా ఉంది

TRINETHRAM NEWS
MLA KP Vivekanand : The government's sincerity towards Hyderabad

MLA KP Vivekanand : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు 2026 -27 లో భాగంగా ఆరవ రోజు నిర్వహించిన ప్రశ్నోత్తరాలలో హైదరాబాద్ నగర అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని – నగర అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ప్రజల గొంతుకై బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….”American roads are not good because America is rich, but America is rich because American roads are good” అంటూ అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఎఫ్.కెన్నెడీ రహదారులు, మౌలిక వసతులపై తెలియజేసిన గొప్ప మాటలను ప్రస్తావించారు.

తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులం అందరం కలిసి పెద్దలు, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలిసి వారి మార్గదర్శకత్వంలో నాటి మున్సిపల్ శాఖామాత్యులు కేటీఆర్ ఆధ్వర్యంలో దాదాపు 47 పనులను, 40 ప్రాజెక్టులను ఎస్ఆర్డిపి అనే కార్యక్రమం ద్వారా పాతబస్తీ తో పాటు నగర శివారు ప్రాంతాలలో ఫ్లై ఓవర్లు, లింక్ రోడ్లతో పాటు అనేక రకాల మౌలిక వసతులు కల్పించి 30 నుండి 40% ట్రాఫిక్ రద్దీని తగ్గించే విధంగా అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం.

హైదరాబాద్ నగర అభివృద్ధిపై బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను గుర్తించి హైదరాబాదు నగర ప్రజలు మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు భారీ మెజార్టీతో మళ్లీ గెలిపించారు.

కానీ నేడు హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో రెండున్నర ఏళ్లలో కేవలం 120 కోట్లు ఖర్చు పెట్టడానికి చూస్తుంటే ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత అర్థమవుతావుంది.

హైదరాబాద్ నగరాభివృద్ధికి దాదాపు 15,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నాలుగు నెలల్లో 120 కోట్ల పనులు చేపడితే మిగిలిన పనులను చేపట్టేందుకు ఇంకా 100, 120 సంవత్సరాలు అవుతదా…? ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకు ఈ లోపం.

ఇది హైదరాబాద్ నగరానికి చెందిన ప్రజాప్రతినిధిగా బాధతో చెప్తున్న మాట.

మంత్రి సమాధానం లో భాగంగా ప్రకటించిన

1) కుత్బుల్లాపూర్ – పైప్లైన్ రోడ్ వయా సెంట్ ఆంటోనీస్ రోడ్, వెన్నెలగడ్డ.

2) కుత్బుల్లాపూర్ – పైప్లైన్ రోడ్ వయా గోదావరి హోమ్స్ పనులు రద్దయ్యాయి. కానీ రద్దయిన పనులను సభలో పెట్టారంటే ప్రభుత్వానికి నగరాభివృద్ధిపై ఉన్న శ్రద్ధ, అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారో స్పష్టమవుతా ఉంది.

ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలి, ఆ తర్వాత అభివృద్ధి చేయాలి అనే ముఖ్యమంత్రి మాటకు ఆచరణలో, మాటలో సంబంధమే లేదు అనేది స్పష్టమవుతా ఉంది.

మంత్రి మరో సమాధానం లో భాగంగా మియాపూర్ – కూకట్పల్లి వై జంక్షన్ పనులు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని సమాధానం ఇచ్చారు. కానీ అక్కడ కనీసం ఇటుక పెట్టి, పనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. మీ మాటల్లోనే ప్రభుత్వ చిత్తశుద్ధి, అధికారుల పర్యవేక్షణ కనబడతా ఉంది.

ప్యాకేజీ రెండు లో భాగంగా 29 కోట్లతో చేపడుతున్న ఎన్.హెచ్ 44 – రామిరెడ్డి నగర్ వయా ఫాక్స్ సాగర్ పనులను 100 ఫీట్ల లింకు రోడ్డుగా రోడ్డు పనులను చేపట్టిన అక్కడ 100 ఫీట్ల రోడ్డుకు సాధ్యం కాదని 40 ఫీట్లకు కుదించమని అడిగినా ఈరోజు వరకు దానిపై ఎలాంటి నిర్ణయం లేదు.

హైదరాబాద్ నగరాభివృద్ధిలో భాగంగా బాచుపల్లి చౌరస్తాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 2020, 2021 సంవత్సరంలో శంకుస్థాపన గావించి ప్రారంభమైన ఫ్లై ఓవర్ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల నాలుగు నెలలు గడుస్తున్న పర్యవేక్షణ లేక నత్త నడకన సాగుతున్నాయి.

250 ఫీట్ల బ్రహ్మాండమైన రోడ్డు ఇది. ఇప్పటికే ఈ మార్గంలో 30, 40 అంతస్తుల హై రైజ్ అపార్ట్మెంట్లు వస్తున్నాయి. కానీ ఫ్లైఓవర్ పనులు ఎప్పుడు పూర్తవుతాయో అర్థం కావడం లేదు.

అదేవిధంగా పేట్ బషీరాబాద్ సర్వేనెంబర్ 25/1, సెయింట్ ఆన్స్ స్కూల్ పక్క నుంచి ఎప్పటినుంచో బాట ఉంది. జర్నలిస్టులకు ఇండ్లు వచ్చినాయి, కాలనీలు వెలిసాయి. నగరాభివృద్ధి లో భాగంగా వెనుక వైపు ఉన్న కాలనీలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ రోడ్డును అభివృద్ధి చేద్దామంటే హెచ్ఎండిఏ కమిషనర్ ఆపుతున్నాడు. ఎందుకు అని అడిగితే పొలిటికల్ ప్రెజర్ అంటున్నారు. ఇప్పటికే వాటర్ వర్క్స్ వారు శివరేజ్ సాంక్షన్ చేసినారు. హెచ్ఎండిఏ కమిషనర్ పనులను ముందుకు సాగనివ్వక పోవడంతో అభివృద్ధి ఆగిపోయింది.

దూలపల్లి – కొంపల్లి పనులు పర్యవేక్షణ లేక ముందుకు సాగడం లేదు.

బోయిన్ పల్లి – సుచిత్ర – కొంపల్లి – కండ్ల కొయ్య – మేడ్చల్ ఫ్లై ఓవర్ పనులను ఎన్ హెచ్ ఎ ఐ చేపట్టినా ఏజెన్సీ కాంట్రాక్టర్ మూలంగా ఆగిపోయాయి.

ఇప్పటికే 66 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఈ పనుల పురోగతిపై ఏనాడు ఎన్ హెచ్ ఎ ఐ అధికారులను గాని, సంబంధిత మంత్రితో గాని సమావేశమై పనుల పురోగతిపై చర్చించలేదు.

హైదరాబాద్ నగరాభివృద్ధిపై నగరంలోని ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాలని మొదటి బడ్జెట్ సమయంలో సీఎం ని అడిగినం. నగరానికి చెందిన ప్రజాప్రతినిధులను అందరిని పిలిపించుకుంటాం. మాట్లాడతాం అన్నారు. కానీ ఒక్కసారి కూడా సమావేశం నిర్వహించిన సందర్భమే లేదు.

ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తూ బిజీగా ఉన్నారేమో, కానీ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇన్చార్జి మంత్రిగా ఉన్న మీరైనా సమావేశం ఏర్పాటు చేయాలి కదా.

మా బాధలు అసెంబ్లీలో వినరు, బయట విన్నారు. ఓడిపోయిన వాళ్ల పేర్లు బోర్డులపై పెడతారు.

సీఎం నిర్లక్ష్యంతోనే హైదరాబాద్ నగర అభివృద్ధి కుంటుపడింది. ఎందుకు నిదర్శనం మంత్రి సమాధానం లోనే తప్పులు ఉన్నాయి.

ప్రజలను ఇబ్బందులకు గురి చేసే రాజకీయాలను పక్కనపెట్టి ప్రభుత్వం హైదరాబాద్ నగరాభివృద్ధిపై దృష్టి సారించాలి..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top