Srisailam Goud : ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ కూన శ్రీశైలం గౌడ్

TRINETHRAM NEWS
Srisailam Goud distributes Chief Minister's Relief Fund cheques

Srisailam Goud : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎనిమిది మందికి మంజూరైన నాలుగు లక్షల యాభై వేల(4,50,000) విలువైన చెక్కులను ఈరోజు షాపూర్ నగర్ లోని నివాసంలో అనారోగ్యం కారణంగా చికిత్స చేయించుకున్న రాజేష్ కుమార్, లావు సప్న, శ్రీలేఖ, ముద్దుల బాబు, మహమ్మద్ హుస్సేన్, మాధవి, చిన్న స్వామి, విశాలాక్షి గార్లకు మంజూరైన చెక్కులను ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ పంపిణీ చేశారు…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి [CMRF] అనేది నిరుపేదలకు ఆర్థిక అవసరాన్ని తీర్చే ఒక గొప్ప కార్యక్రమం అని తెలియజేశారు, నియోజకవర్గం పరిధిలో నిరుపేదలు అనారోగ్యం బారిన పడి చికిత్స చేయించుకున్నట్లయితే వాటికి సంబంధించిన రసీదులను తమ సిబ్బందికి అందజేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top