త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం
సెంట్రల్ లైటింగ్ & రోడ్ డివైడింగ్ మరియు పలు అభివృద్ధి పనుల పరిశీలన
ములకలపల్లి మండలం తాళ్లపాయి పంచాయతీ రింగిరెడ్డిపల్లి గ్రామంలో స్థానిక గ్యాంగ్ వార్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ ప్రారంభోత్సవాన్ని శుభారంభం చేసిన ఆయన మాట్లాడుతూ యువత శారీరకంగ మానసికంగా దృఢంగా తయారవ్వాలంటే క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు క్రీడల ద్వారా స్నేహబంధాలు క్రమశిక్షణ పట్టుదల పెంపొందుతాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటోందని గ్రామీణ స్థాయిలో ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్‌లు కీలకం అని తెలిపుతూ నిర్వాహకులను అభినందించారు అదేవిధంగా గ్రామీణ యువత చెడు వ్యాసనాల వైపు వెళ్లకుండా ఆటలతో పాటు విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామీణ స్థాయి యువతీయువకులకు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో ప్రభుత్వం నుంచి ఎల్లపుడు ప్రోత్సాహం అందిస్తామన్నారు. గ్యాంగ్ వార్ సభ్యులు సామజిక సేవాకార్యక్రమాలను చేపట్టి మండల ప్రజలను చైతన్యవంతులుగా తయారు చేయాలన్నారు. గ్యాంగ్ వార్ యూత్ సభ్యులకు ప్రోత్సాహం అందిస్తానని పేర్కొన్నారు. మండల కేంద్రంలో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ రోడ్ డివైడింగ్ పనులతోపాటు పలు గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పర్యటనలో భాగంగా చౌటిగూడెం గ్రామంలో వైభవంగా జరుగుతున్న అంకమ్మ అమ్మవారి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
వీకే రామవరం గ్రామంలో విధ్యుత్ షాక్ తో అకాల మరణం చెందిన కోర్స అరవింద్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ పరంగా సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. పూసుగూడెం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన తేజావత్ నందని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి , మాజీ సర్పంచులు కారం సుధీర్ కుమార్, సున్నం సుధాకర్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పాలకుర్తి సుమిత్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొడిమే వంశీ, శనగపాటి రవి, కోండ్రు సుందర్ రావు, గడ్డం రాములు, కీసరి సమ్మయ్య, మడకం చిరుమప్ప, కుంజా రవి, పత్తిలాల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


