జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలంలో పర్యటించిన గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాత గంగారం గ్రామంలో మిద్దె సీతారాం(లేటు) చంద్రకళ దంపతుల కుమారుడు హరి రోహిత్ కుమార్తె వాసవిల పంచకట్టు నూతన వస్త్రాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ముత్యాలంపాడు గ్రామంలో సున్నం వారి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదే గ్రామంలో ఎమ్మెల్యే సహాయంతో హార్ట్ సర్జరీ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మడకం రాజు ని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి, మాజీ సర్పంచులు కారం సుధీర్, సున్నం సుధాకర్, మండల నాయకులు సురభి రాజేష్, సెనగపాటి రవి, అశ్వరావుపేట యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పాలకుర్తి సుమిత్, వాడే శేషగిరి, కొత్వాల గిరి, తీట్ల బాబురావు, గాడి తిరుపతి రెడ్డి, కొప్పుల రాంబాబు,మడకం శ్రీనివాస్, మడకం రవి, మడకం నరసింహారావు, మడివి హరినాథ్, పోడియం వెంకట కృష్ణ, కుంజా రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare's visit to

You cannot copy content of this page