అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 23: అల్లూరి జిల్లా అరకువేలి మండలం (ఐటిఐ)జంక్షన్ వద్ద అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హిమగిరి,నేతృత్వంలో డాగ్ స్క్వాడ్ సాయంతో వాహన తనిఖీలు నిర్వహించబడ్డాయి. అరకు నుండి విశాఖపట్నం దిశగా వెళ్తున్న వాహనాల్లో అక్రమంగా గంజాయి రవాణా జరుగుతోందనే విశ్వసనీయ సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టబడ్డాయి.
ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని డాగ్ స్క్వాడ్ తో కూడిన బృందం క్షుణ్ణంగా తనిఖీ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ లను పరిశీలించి, వాహనదారులు తప్పకుండా చట్టబద్ధమైన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే మైనర్లు వాహనం నడిపిన సందర్భాల్లో, అలాగే మైనర్లకు వాహనం అప్పగించిన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని, ప్రతి ఒక్కరూ తప్పకుండా లైసెన్స్ పొందాలని పోలీస్ అధికారులు తెలిపారు.ఈ తనిఖీల్లో అరకు పోలీస్ స్టేషన్ ట్రైనింగ్ ఎస్సై మేడం,మరియు డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


