MLA Jare : లకలపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జారె

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ములకలపల్లి మండలంలో పర్యటించి పాలవాగు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు పోతురాజుల విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయకమిటీ బాధ్యులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండలకేంద్రంలో గద్దే బుచ్చిబాబు అరుణ దంపతుల మనవరాళ్లు మనస్వి – కనిస్క ల ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. కమలాపురం గ్రామంలో గుజ్జుల వారి వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుంపుల రవితేజ, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పాలకుర్తి సుమిత్ , ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొడిమే వంశీ మరియు మండల కాంగ్రెస్ నాయకులు అడపా నాగేశ్వరావు, బాల అప్పారావు, కాంతారావు,శనగపాటి రవి, షేక్ అజీజ్, కౌలురి ప్రసాద్ మరియు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare visited Lakalapalli

You cannot copy content of this page

Scroll to Top