త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ములకలపల్లి మండలం పూసుగూడెం సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ పంపుల ద్వారా దిగువ ప్రాంతాలైన ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని రైతులకు వ్యవసాయ అవసరాల కోసం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ రైతు కష్టాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుంటూ ప్రతి ఎకరం పండాలని ప్రతి రైతు కుటుంబం సంతోషంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాగునీటి అవసరాలను తీర్చేందుకు తక్షణమే చర్యలు తీసుకుని దిగువకు సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గుంపుల రవితేజ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పాలకుర్తి సుమిత్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొడిమే వంశీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు శనగపటి రవి, గాడి తిరుపతి రెడ్డి, అనుమాల సత్యనారాయణ, కుంజా రవి, భుక్య పతిలాల్, మడకం చిరమప్ప, అజీజ్, కౌలురి ప్రసాద్ మరియు నాయకులు, పలుశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


