MLA Jare : 100 రోజుల కార్యాచరణలో భాగంగా డ్రైనేజీ క్లీనింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జారె

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. అశ్వారావుపేట నూతన మున్సిపాలిటీలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఇటీవల 15 కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఈ అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికై 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న డ్రైనేజీలు శుభ్రపరిచే పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. స్థానిక అధికారులు కార్మికులతో మాట్లాడి పనుల ప్రగతిని తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ మున్సిపాలిటీలో పారిశుధ్యం మురుగు కాలువలు మంచినీటి సరఫరా వీధి దీపాలు అంతర్గత రోడ్ల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని రాబోయే వర్షాకాలాన్ని ద్రుష్టలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు రాకుండా ముందుగా పరిసరాల పరిశుభ్రత కోసం డ్రైనేజీలు శుభ్రం చేయించి దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిగిలిన అన్ని పనులను 100 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టామని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare inspects drainage

You cannot copy content of this page

Scroll to Top