Dr. Shyam Prasad Mukherjee : ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

TRINETHRAM NEWS

తేదీ : 23/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం, బోనగిరి గ్రామం బూత్ నెంబర్ ఐదు లో ఘనంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి జరిగింది. అఖండ భారత్ కోసం ప్రాణాలర్పించిన మహోన్నత నాయకుడు ఆయన, భారతీయ జన సంఘ స్థాపన ద్వారా సైదాంతిక పునాది వేసింది , మరియు ఆయన చేసిన చరితాత్మక పోరాటం దేశ చరిత్రలో నిలిచిపోయిందని భారతీయ జనతా పార్టీ నాయకులు అనడం జరిగింది. అదేవిధంగా నిస్వార్థ సేవ, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం, విలువలతో కూడిన జీవితానికి ఆయన ప్రతిరూపం అన్నారు.

ధైర్యం, దార్శనికత, అంచలంచలమైన దేశభక్తి, నేటి యువతకు స్ఫూర్తిగా ఆయన చూపుల మార్గంలో నడుస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సకారానికి కృషి చేస్తున్నారని, ఖండిత భారతదేశం అఖండత్వం, కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు రాంప్రసాద్ ముఖర్జీ, ఆయన పుణ్యతిధి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నామని బిజెపి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, కాబోయే కుక్కునూరు మండలం అధ్యక్షులు కుంజా. వెంకట నరసయ్య దొర అనడం జరిగింది.

స్వతంత్ర భారత రాజకీయాసంలో సిద్ధాంతరహిత రాజకీయాలు, స్వార్ధ పదవి, వ్యామోహం వాదాల , కారు మబ్బులు కమ్ముకున్న ఆ తొలి దినాలలో ఒక మెరుపు మెరిసి మాయమైందని, కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ మెరుపు వెలుగుతున్న క్షణకాలమే కావచ్చు కానీ , గాఢాంధకారం భవిష్యత్తులో ముగిసి ఉన్న భారత ప్రజానీకానికి ఆ మాత్ర వెలుగు చాలు , అని అనే వాస్తవమైన రాజకీయ పదాన్ని కనుగొనడానికి, స్వతంత్ర భారత రాజకీయాలకు ఒక నూతన దిశ మరియు లక్ష్యాన్ని ప్రసాదించిన ఆ మెరిపే స్వర్గీయ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ అని పేర్కొన్నారు. భారతమాత కన్నా మహా సంతానంలో ఒకరు ఆయన జీవితం, శరీరంలో ప్రతిక్షణం మాతృభూమి సేవకే సమర్పితం అయ్యారని, పందొమ్మిది వందల ఒకటి జులై ఆరు వ తేదీన అసుతోస్ ముఖర్జీ, రాణి జోగ్మయా పుణ్య దంపతులకు ఆయన జన్మించారని , మన తండ్రి నుంచి అనేక గొప్ప గుణాలు నేర్చుకున్నాడని, వాటిలో అతి ప్రముఖ గుణం ఆయన తండ్రి యొక్క రాజీలేని జాతీయ భావన అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు తూము. వెంకటేశ్వరరావు, దుద్దుకూరి. కృష్ణార్జున రావు, జి. లక్ష్మణరావు, మైసాక్షి. రామాచారి, సున్నం. రాము తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dr. Shyam Prasad Mukherjee's

You cannot copy content of this page

Scroll to Top