త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై రక్తదానంలో పాల్గొన్న వారిని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం చాలా విలువైనదన్నారు. మనం ఇచ్చే ఒక్క యూనిట్ రక్తం ఒక ప్రాణాన్ని కాపాడుతుందని ప్రతి ఆరోగ్యవంతుడూ సమయానికి రక్తదానం చేస్తే ఎన్నో ప్రాణాలు రక్షించబడతాయన్నారు.
అదేవిధంగా లయన్స్ క్లబ్‌లో గతంలో విశిష్ట సేవలు అందించిన పెద్దలను ఘనంగా సన్మానించారు. పిల్లల కోసం లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్ ను ఎమ్మెల్యే ప్రారంభించి చిన్నారులు ఆనందంగా ఆడుకునే వాతావరణం కల్పించినందుకు లయన్స్ క్లబ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మా కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు, మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నరేంద్ర, లయన్స్ సభ్యులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


