CPI : స్థానిక ఎన్నికలే లక్ష్యంగా సిపిఐ కౌన్సిల్ సమావేశం

TRINETHRAM NEWS

8 పంచాయతీలు, 4 ఎంపీటీసీ స్థానాలలో పోటీకి సిద్ధం
పట్టణంలో వీలైనన్ని కౌన్సిలర్ స్థానాలలో పోటీ
సిపిఐ అశ్వారావుపేట నియోజకవర్గ కార్యదర్శి : సయ్యద్ సలీం

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట మండలంలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిపిఐ పార్టీ ఎన్నికలలో తమ కార్యాచరణను, వ్యూహాన్ని రూపొందించుకొనుటకు ఈరోజు సయ్యద్ మియాజాని భవన్ ( సిపిఐ పార్టీ ఆఫీస్) లో మండల కార్యదర్శి వగ్గెల అర్జునరావు అధ్యక్షతన సిపిఐ మండల, పట్టణ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఐ అశ్వారావుపేట నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలో సిపిఐ పార్టీ తన మార్కును చూపించాలని, ఇప్పటినుండే కార్యకర్తలు నాయకులు సమాయత్తమై పనిచేసి వీలైనన్ని సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించే విధంగా కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలకు కూడా ఎంతో సమయం లేదని పట్టణంలో ఉన్న సిపిఐ నాయకులు కార్యకర్తలు ఇప్పటినుండే కష్టపడి పనిచేసి ఎన్నికలలో వీలైనన్ని స్థానాలలో సిపిఐ పార్టీ నీ గెలిపించే విధంగా కృషి చేయాలని ఆయన అన్నారు. మనం ప్రజల కోసం చేసిన ఉద్యమాలు, పోరాటాలే మనకు విజయం చేకూర్చి పెడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు గన్నిన రామకృష్ణ, అశ్వారావుపేట మండల కార్యదర్శి వగ్గెల అర్జున్ రావు, సిపిఐ అశ్వారావుపేట పట్టణ కార్యదర్శి నూకవరపు విజయ్ కాంత్ మరియు సిపిఐ అశ్వారావుపేట మండల, పట్టణ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CPI Council meeting

You cannot copy content of this page

Scroll to Top