WhatsApp Image 2025 01 30 at 15.47.13
మహాత్మాగాంధీకి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి, 30 జనవరి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి పట్టణంలో నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని, గాంధీ చిత్రపటానికి పూల మాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిస్తున్నానని అన్నారు.
అహింస అనే ఆయుధంతో సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దాస్యశృంఖలాల నుంచి భరతమాతకు విముక్తి కలిగించిన గొప్ప మహోన్నతుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు. దేశానికి స్వాతంత్య్ర ఫలాలు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధన కోసం కృషి చేద్దామని అన్నారు. దేశానికి గాంధీజీ చేసిన సేవలు ఎంతో గొప్పవన్నారు. శాంతి, సామరస్యంతో దేనినైనా సాధించ వచ్చని ఆచరణలో చూపించారన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
