జూలై 11, 2026
TRINETHRAM NEWS
MLA Distributes CMRF

MLA Distributes CMRF : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 03; తిరువూరు నియోజకవర్గం మండలంలోని డైనమిక్ శాసనసభ్యులు కొలిక పూడి శ్రీనివాసరావు తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఇరవై తొమ్మిది వ విడత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు.

ఈ విడతలో నూట ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకు సుమారు రూ.యాభై ఆరు లక్షల విలువ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మరియు వాళ్ల కుటుంబ సభ్యులతో , ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తూ వైద్య చికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు.

ఇప్పటివరకు ఇరవై తొమ్మిది విడతల్లో మొత్తం లక్ష నలభై మంది లబ్ధిదారులక ఎనిమిది కోట్ల, ఇరువై లక్షల, నలభై మూడు వేల, ఆరు వందల యాభై నాలుగు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు.

అలాగే, ప్రజల కష్టాలను అర్థం చేసుకుని అవసరమైన సమయంలో వెంటనే స్పందిస్తూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరువూరు నియోజకవర్గానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వెల్లడించారు.నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయనిధి పంపిణీ జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అనేక దరఖాస్తులు వచ్చిన పట్టించుకోలేదని విమర్శించారు.. ప్రస్తుతం రాష్ట్ర కూటమి ప్రభుత్వం పారదర్శక విధానంలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ముఖ్యమంత్రి సహాయనిధి అందేలా చర్యలు తీసుకుంటోందని, కోట్ల రూపాయల విలువైన సహాయాన్ని ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు.

ప్రజలకు అవసరమైన ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకం సకాలంలో అందేలా తాము నిరంతరం కృషి చేస్తున్నామని, ముఖ్యమంత్రి సహాయనిధికి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయడం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఆపద సమయంలో తమకు అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే తమ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి సహాయనిధి అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్న ఆయనకు ప్రజలు, సంబంధిత లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page