ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Ramavath Ravindra Quality medical

దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

Ramavath Ravindra : దేవరకొండ డివిజన్ జులై 03, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా , దేవరకొండ నియోజకవర్గం కొండమల్లెపల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీరక్ష తల్లి–పిల్లల ఆసుపత్రిని మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు…..గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన వైద్యం అందించే విధంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సేవలందించాలని సూచించారు. వైద్య సేవల్లో మానవత్వం, బాధ్యతతో వ్యవహరించాలని, ప్రతి రోగికి మెరుగైన చికిత్స అందేలా కృషి చేయాలని కోరారు. ఆసుపత్రి అభివృద్ధి చెందుతూ ప్రజలకు విశ్వసనీయమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page