జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గండుగులపల్లిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హృదయపూర్వకంగా అభినందించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఇది అశ్వారావుపేట నియోజకవర్గ విద్యా స్థాయిని ప్రతిబింబించడమే కాక ఉపాధ్యాయుల కృషికి తల్లిదండ్రుల ప్రోత్సాహానికి విద్యార్థుల పట్టుదల‌కు నిదర్శనమన్నారు. అశ్వారావుపేట జవహర్ విద్యాలయంలో చదివే పి సాయిసంతోష్, కె వర్షిణి, సిహెచ్ శాంతి అను విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించటంతో ప్రత్యేకంగా సన్మానం నిర్వహించి విద్యార్థులను ప్రశంసిస్తూ యాజమాన్యాన్ని అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA congratulates 10th class

You cannot copy content of this page