ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈత పోటీలు…
త్రినేత్రం న్యూస్, ఆత్రేయపురం ఉత్సవం సంక్రాంతి సంబరాలు మొదటి రోజు నిర్వహించిన ఈత పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన ఈ పోటీల్లో సుమారు 200మంది పైగా పాల్గొన్నారు.
18 రకాల ఈవెంట్లలో పోటీలను నిర్వహించారు. చిన్నారులు మొదలుకుని 60 సంవత్సరాల పైగా వయసు ఉన్న మహిళలు, పురుషులు సైతం ఈత పోటీలో పాల్గొనడం విశేషం. పోలీస్ శాఖ నుంచి కూడా పలువురు ఈత పోటీల్లో పాల్గొన్నారు.మొత్తం 54 మంది విజేతలుగా నిలిచారు.
విజేతలందరికీ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్మన్ పొడపాటి తేజస్విని, యువ నాయకుడు బండారు సంజీవ్ లు బహుమతులు అందజేశారు. విజేతలకు నగదు బహుమతి, మెడల్ ట్రోఫీ, ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు.
ఈ పోటీల్లో ఐదు సంవత్సరాల వయసున్న చిన్నారులు మొదలుకుని 60 నుంచి 70 సంవత్సరాల వయస్సున్న వృద్ధుల వరకూ పాల్గొని కిలోమీటర్ వరకు ఈదిన వారిని ప్రత్యేకంగా ఎమ్మెల్యే బండారు అభినందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


