MLA Gorantla Butchaiah Chowdhury : ధవలేశ్వరంలో దళితుల ఆత్మీయ సమావేశం

TRINETHRAM NEWS

ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

త్రినేత్రం న్యూస్, ధవలేశ్వరంలో దళితుల ఆత్మీయ సమావేశంను క్లస్టర్ ఇంచార్జీ తలారి మూర్తి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ దళితుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో దళితుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమాజంలో అన్ని వర్గాలు సమానంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, గృహ నిర్మాణం, ఆరోగ్యం వంటి రంగాల్లో దళితులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, సూచించారు.
ధవలేశ్వరం ప్రాంతంలో దళితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి హామీ ఇచ్చారు. యువత చదువుపై దృష్టి పెట్టి ఉద్యోగావకాశాలు సాధించాలని, మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా తలారి. మూర్తి మాట్లాడుతూ గోరంట్ల. బుచ్చయ్య చౌదరి నాయకత్వంలో రాజమండ్రి రూరల్ దళిత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆత్మీయ సమావేశం ద్వారా విద్య వైద్యం ఉద్యోగం వ్యాపారం వాణిజ్యం గృహ నిర్మాణం అన్ని రంగాలలో అన్ని అవకాశాలు, అందిపుచ్చుకుంటూ జీవన ప్రమాణాలలో అభ్యున్నతి సాధిస్తూ ముందుండేలా తోడ్పాటు అందిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీకి ఊపిరి ఉన్నంతవరకు పసుపు జెండా సైనికుల లాగా పనిచేస్తామని రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటలా నిలబెట్టి దళితుల పూర్తి సహకారం అందజేస్తామని దాని కొరకు తోడ్పడుతామని.

తెలుగుదేశం పార్టీ అంటే దళితుల పార్టీ దళితుల ప్రభుత్వం దళితులను రక్షించే ప్రభుత్వం దళితులను అభివృద్ధి చేసే ప్రభుత్వంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు,కి ఈ సందర్భంగా ఈ సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు
సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా దళితుల మధ్య ఐక్యత, ఆత్మవిశ్వాసం పెరిగిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్స్సేటి ప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండురి అప్పారావు, డైరెక్టర్ మద్దామని, జల్ది కృపారావు, కాయల సత్యనారాయణ, రొంపిచర్ల ఆంటోనీ, తాడేపల్లి నాగరాజు, గోక శ్రీను పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dalits' intimate meeting in Dhavleswaram

You cannot copy content of this page

Scroll to Top