
దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
MLA Balu Naik : దేవరకొండ, జూలై 31: త్రినేత్రం న్యూస్ : విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ జిల్లా పరిషత్ (బాలుర) ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ పొందిన చేరిపల్లి శ్రీనివాసులు పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సుదీర్ఘ సేవా కాలంలో వేలాది మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి వారి జీవితాలను తీర్చిదిద్దడంలో శ్రీనివాసులు విశేష కృషి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం మాత్రమే కాకుండా భావితరాలను నిర్మించే బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ-వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, దేవరకొండ చేనేత సహకార సంఘం అధ్యక్షులు చేరిపల్లి బాలరాజు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe