జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి. –ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి అనేది నా సంకల్పం..

ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ .

దేవరకొండ (చందంపేట) సెప్టెంబర్ 18 త్రినేత్రం న్యూస్. చందంపేట మండల పరిధిలోని పోల్య నాయక్ తండా గ్రామంలో “జనహిత ఎం ఎల్ ఏ మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమంలో భాగంగా వివిధ కాలనీలో ప్రజా ప్రతినిధులు,అన్ని శాఖల అధికారులతో కలసి పర్యటించి,గ్రామ ప్రజలకు నేరుగా కలిసి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని అక్కడిక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను ఎం ఎల్ ఏ. బాలు నాయక్ పరిష్కరించారు.
ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయో తెలుసుకుంటూ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సాగిన జనహిత యాత్ర.అన్ని విభాగాల అధికారులతో కలిసి ప్రజల వినతులను స్వీకరించి,కొన్ని సమస్యలు అక్కడి అక్కడే పరిష్కరించారు.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు లబ్దిదారులను అధికారులు కానీ ప్రజాప్రతినిధులు డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, అలా ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా నాకు ఫోన్ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janahita MLA Morning Walk

You cannot copy content of this page