
MLA Balu Naik : దేవరకొండ, జూలై 30, త్రినేత్రం న్యూస్ . ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, దేవరకొండ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.
దేవరకొండ పట్టణంలోని 1, 2, 3 వార్డుల పరిధిలో ఖిల్లా బజార్, బొడ్రాయి బజారు, పాత పోలీస్ స్టేషన్, మసీదు ముందు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను, అలాగే ముత్యాలమ్మ బజారులో నిర్మిస్తున్న మురికి కాలువల పనులను ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకుని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్ణీత గడువులోగా అత్యున్నత నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడారు..
ప్రజల అవసరాలే అభివృద్ధి ప్రణాళికలకు ప్రాతిపదికగా తీసుకుని ప్రతి వార్డుకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ-వెంకటేశ్వర్లు, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎం.ఏ. సిరాజ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు వెంకటేష్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు నజీర్ అహ్మద్, మైనంపల్లి సర్పంచ్ కొర్ర రాంసింగ్, సంబంధిత శాఖల అధికారులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe