MLA Adireddy : మణిదీప్‌వర్మకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి అభినందనలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం : జేఈఈ అడ్వాన్స్‌ ఓపెన్‌ కేటగిరిలో ఆలిండియా స్థాయిలో 386వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌లో 21వ ర్యాంకు సాధించిన ముదునూరి మణిదీప్‌వర్మను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అభినందించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ గాదాలమ్మ నగర్‌లోని వారి నివాసానికి వెళ్లి మణిదీప్‌వర్మను శాలువాతో సత్కరించి అభినందించారు. అలాగే మణిదీప్‌వర్మ తల్లిదండ్రులు ముదునూరి శ్రీనివాసరాజు, మాధవీ ఝాన్సీలను కూడా అభినందించారు.

ఇంగా బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఆకాంక్షించారు. ముంబై ఐఐటీలో సీఎస్‌ఈ సీటు సాధించడం, కంప్యూటర్‌ ఇంజనీర్‌ కావడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా మణిదీప్‌వర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ చొప్పెర్ల వీరభద్రరావు, కూటమి నాయకులు వాసిరెడ్డి బాబి, మహ్మద్‌ ఖాన్‌, అప్పారావు, బాలు, శ్రీనివాస్‌, ఉమామహేశ్వరి, బొర్రా చిన్ని, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Adireddy congratulates Manideep

You cannot copy content of this page

Scroll to Top