
మండలి కృష్ణారావు ఖ్యాతి మహోన్నతం
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
Minister Manohar : త్రినేత్రం న్యూస్ : మండలి కృష్ణారావు ఖ్యాతి మహోన్నతం అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం సాయంత్రం తెనాలిలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఎన్టీఆర్ కళా వేదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత – సంస్కృతి సమితి వారి సౌజన్యంతో బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ – తెనాలి వారి నిర్వహణలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శతజయంతి వేడుకల సందర్భంగా మహాపురుషుడు మండలి” నాటకం ప్రదర్శన, శత జయంతి సభ ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా మండలి వెంకట కృష్ణారావు చిత్రపటానికి ముఖ్య అతిధి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఆత్మీయ అతిధి శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
మండలి వారి సేవా పురస్కారాలు
ఈ సందర్భంగా తెనాలి వి.జి.కె & వి.వి.యల్ ఫౌండేషన్, అమెరికా డాక్టర్ బాబు ఆర్. వడ్లమూడి తరపున తుమ్మల కిషోర్, హైదరాబాద్ ఎ.ఎస్.ఆర్ ఫౌండేషన్ / బి.హెచ్.ఐ.ఎల్ అరవ రామకృష్ణలకు మండలి వారి సేవా పురస్కారాలు ప్రధానం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

