ఆగస్ట్ 17, 2026
TRINETHRAM NEWS
MLC Teenmar Mallanna to arrive in Jangaon

మల్లన్న సమక్షంలో భారీ చేరికల మహోత్సవం.!

Teenmar Mallanna : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు రేపు జనగామ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. స్థానిక బాలాజీ నగర్ లోని జూబ్లీ గార్డెన్ (జూబ్లీహిల్స్) ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశం మరియు చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.ఈ సందర్భంగా వివిధ పార్టీల నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తీన్మార్ మల్లన్న సమక్షంలో పార్టీలో చేరనున్నారు. నిరుద్యోగ, సామాజిక సమస్యలపై మల్లన్న తన గళాన్ని విప్పనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం పిలుపునిచ్చారు..

📍 వేదిక: జూబ్లీ గార్డెన్ ఫంక్షన్ హాల్, జనగామ.

📅 తేదీ:10-05-2026 (ఆదివారం)

⏰ సమయం: సాయంత్రం 05:20 నిమిషాలకు.

You cannot copy content of this page