Minister Komati Reddy Venkat Reddy : మిర్యాలగూడ సభలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

TRINETHRAM NEWS

పేదల రాజ్యం ఇందిరమ్మ రాజ్యం..

Trinethram News : ఈ 3ఏళ్లు.. వచ్చే 5ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది.

ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,సహచర మంత్రులతో కలిసి ఈ రాష్ట్రంలో సన్న బియ్యం ఇయ్యాలని నిర్ణయించాం..మేము తినే సన్న బియ్యమే ఇస్తున్నాం..

మిర్యాలగూడ ప్రాంతంలో రైస్ ఇండస్ట్రీ ఎక్కువ… ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 18మున్సిపాలిటీలు ఉన్నాయి..అన్నింటిని విజయం సాధించి ముఖ్యమంత్రి కి గిఫ్ట్ ఇద్దాం.. ఇటీవల ఒకాయన జాతిపిత అని బయల్దేరాడు

తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి…తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి తీసుకుంటా అని చెప్పిన నేను కూడా జాతిపితా అవుతనా..? తెలంగాణ కోసం అసువులు బాసిన నల్లగొండ ముద్దుబిడ్డ శ్రీకాంతచారి,కానిస్టేబుల్ కిష్టయ్య, ఇషాన్ రెడ్డి లాంటి వారు ప్రాణత్యాగం చేసి స్వర్గంలో ఉన్నారు..

తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1100 మంది బిడ్డలు జాతిపితలు.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్న..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister Komati Reddy Venkat Reddy in Miryalaguda Sabha

You cannot copy content of this page

Scroll to Top