ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Public Grievance Redressal

Public Grievance Redressal : అల్లూరి జిల్లా,అరకులోయ జూలై 16, (త్రినేత్రం న్యూస్): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్‌) నిర్వహణ నేపథ్యంలో పాడేరు కలెక్టర్ కార్యాలయంలో ప్రతి వారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ వారం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంతి టి. బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జూలై 17వ తేదీ శుక్రవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం స్థానంలో అదే రోజు బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు),బూత్ లెవల్ అసిస్టెంట్లు (బీఎల్ఏలు), ప్రజాప్రతినిధులు మరియు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఓటర్ల వివరాల సవరణ, ధృవీకరణ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు.
ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు తమ నివాసాల్లో అందుబాటులో ఉండి బీఎల్ఓలు, బీఎల్ఏలకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఓటర్ల జాబితాలో తమ పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page