ధర్మారం, జూన్ -30: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు సోమవారం ధర్మారం మండలంలోని నంది మేడారం లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు ..ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ఏసిడిపి నిధులు సరిపోని పక్షంలో నంది మేడారం గ్రామంలో అభివృద్ధి పనులకు కలెక్టరేట్ నిధుల నుంచి 3 కోట్ల కలెక్టర్ మంజూరు చేశారని అన్నారు.
కోటి 30 లక్షల రూపాయలను నంది మేడారం గ్రామంలో అభివృద్ధి పనులకు కేటాయించామని అన్నారు నంది మేడారం గ్రామంలో 261 విద్యుత్ పోల్స్ తరలింపు కోసం 26 లక్షల రూపాయలు మంజూరు చేసామని అన్నారు. 80 లక్షల రూపాయల విలువ గల అంతర్గత సిసి రోడ్లు వేసుకున్నామని, మేడారం నుంచి కట్కెనపల్లి, కోర్టు వరకు సీసీ రోడ్డు పనులు నెల రోజులలో మంజూరు చేస్తామని అన్నారు నంది మేడారం గ్రామంలో అర్హులైన 80 మంది నిరుపేదలకు మొదటి విడత కింద ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా అర్హులు ఉన్న తప్పనిసరిగా ఇండ్లు మంజూరు అవుతాయని, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని అన్నారు.
స్థలం లేని నిరుపేదలకు ప్రభుత్వ ఇంటి స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసే ఆలోచన చేస్తున్నామని అన్నారు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా సంఘాల ద్వారా బస్సు కొనుగోలు చేసి ఆర్టీసీ కు అద్దె కు పెట్టడం జరిగిందని, దీనివల్ల ప్రతి నెల 46 వేల రూపాయల ఆదాయం లభిస్తుందని అన్నారు పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి బి .గంగయ్య , పీడీ హౌసింగ్ రాజేశ్వర్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లింగమూర్తి, ధర్మారం తహసిల్దార్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


