Indiramma House : మొయినాబాద్ మండలం లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించిన భీమ్ భరత్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : మొయినాబాద్ మండలం లోని శ్రీ రామ్ నగర్ , నక్కల పల్లీ, ఎథ్ బార్ పల్లి , టోల్ కట్ట గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని లబ్ధి దారులకు చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ పామేన భీమ్ భరత్ నియామక పత్రాలు ఇచ్చి ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా అర్హులైన పేదలందరికీ సొంత ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కేటాయించింది. కాగా మొదటి విడతలో సొంత జాగా ఉన్నవారికే ఇండ్లను కేటాయిస్తోంది ప్రభుత్వం. వచ్చే విడత నుంచి ఇంటి స్థలం లేని వారికి ప్లాట్ మంజూరు చేసి రూ. 5 లక్షలతో ఇల్లు నిర్మించనుంది అని తెలియజేశారు .
ఎస్టీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి అదనంగా రూ. లక్ష సాయం అందించనున్నట్లు తెలిపారు. అంటే బీసీ, మైనార్టీ వర్గాలకు ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు సాయంగా అందిస్తుంటే, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం రూ. 6 లక్షలు సాయం అందించనున్నట్లు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికలహమీల్లోనూ ఈ వాగ్ధానం చేసింది. ఇంది.
ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను మహిళల పేరు మీదే అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళలు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగున్నట్లే అని పేర్కొంది. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను మహిళ పేరు మీద మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ మొయినాబాద్ మండలం అధ్యక్షులు మానయ్య , వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి , మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాల కృష్ణ రెడ్డి , ఎంపీటీసీ కేబుల్ రాజు , ఎంపీటీసీ గణేష్ , నర్సింగ్ రావు , విఠల్ ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , ఇందిరమ్మ కమిటీ సభ్యులు , గ్రామ ప్రజలు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bheem Bharat inaugurated Indiramma

You cannot copy content of this page

Scroll to Top