అసిఫాబాద్ జిల్లా 30 జూన్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 2025 జూలై 09 న చేపట్టనున్న సారంత్రిక సమ్మెకు సంబంధించిన నోటీసును దహెగాం మెడికల్ ఆఫీసర్ అశ్విని కి ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆసిఫాబాద్ జిల్లా ఉద్యోగులు సోమవారం రోజున అందజేశారు.జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ అసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. మధుకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెండింగ్ వేతనాలు 2 నెలలు అనగా మే , జూన్ వెంటనే విడుదల చేయాలని,8 గంటల పని దినలు అమలు చేయాలని,నాలుగో తరగతి ఉద్యోగులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని, పి.ఎఫ్,ఈ.ఎస్.ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 2 వ ఏ.ఎన్.ఎం.లు జ్యోతి , బేబీ ,లక్ష్మి, సత్యవని, అనిత, శాంత తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


