Collector P. Prashanthi : గతంలో ఎన్నడు లేని విధంగా రబీలో ధాన్యం సేకరణ

TRINETHRAM NEWS

క్షేత్ర స్థాయిలో పసలపూడి, వడ్లూరు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తనిఖీలు

Trinethram News : ఉండ్రాజవరం ప్రస్తుత రబీ సీజన్లో 3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు.

సోమవారం ఉండ్రాజవరం మండలంలో రైతు సేవా కేంద్రాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్డీవో రాణి సుస్మిత, ఇతర అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, ప్రస్తుత 2024-25 రబీ సీజన్లో వరి ధాన్యం సేకరణ లో రికార్డు దిశ గా తూర్పు గోదావరి జిల్లా పరిధిలో రబీ సేకరణ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. తొలుత 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని లక్ష్యం కాగా, ఆ మొత్తాన్ని తొలుత 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల మేరకు పెంచాలని రైతుల విజ్ఞప్తి మేరకు

జిల్లా చరిత్ర లో ఎప్పుడూ లేనంత గా 3 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సోమవారం ఒక ప్రకటన లో తెలియజేశారు. రబీ సీజన్ లక్ష్యమైన 2 లక్షల 50 వేల మెట్రిక్ టన్నులను ఇప్పటికే అధిగమించి 2,63,076 మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు . జిల్లా మంత్రి వర్యులు కందుల దుర్గేష్ వారి విజ్ఞప్తి మేరకు గణనీయమైన దిశలో రబీ సీజన్లో ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అదనపు సేకరణ చేయాలని లక్ష్యం గా పెంచడం జరిగిందన్నారు. తొలుత 2.30 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2.50 లక్షలకు, దిగుబడులు పెరిగాయని రైతుల విజ్ఞప్తి మేరకు లక్ష్యాలను 2.80 లక్షల మెట్రిక్ టన్నుల కు పెంచడం జరిగిందనీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం చెల్లింపుల విషయంలో 48 గంటల్లో రైతుల ఖాతాలకు జమ చెయ్యడం, కొందరు రైతుల ఖాతాల్లో 2 నుంచి 4 గంటల్లో జమ కావడం తో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరడం జరిగింది అని పేర్కొన్నారు. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ఉదాత్తమైన ధోరణి, ఆదేశాలు మేరకు ప్రస్తుతం 3 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం గా పనిచేస్తున్నామని చెప్పారు.

2022-23 లో 2.42 లక్షల మెట్రిక్ టన్నులు, 2023-24 లో 2,28,444 మెట్రిక్ టన్నులు, 2024-25 లో ఇప్పటికే 2.61లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించమన్నారు . ప్రస్తుత లక్ష్యం గత మూడు రబీ సీజన్లో ధాన్యం సేకరణ చేసిన వాటి కంటే ఎంతో అధికమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియచేశారు. ఇప్పటికి దాదాపు జిల్లా పరిధిలో రైతుల ఖాతాలో రూ.477.44  కోట్ల చెల్లింపులు చేసినట్లు తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఎఫ్ ఎ క్యూ నిబంధనలు పాటిస్తూ రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు వివరాలు తెలియ చేస్తూ, ప్రస్తుతం రబీ సీజన్లో 2.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసినట్లు ఇందుకు సంబంధించి సుమారు రూ.612 కోట్ల చెల్లింపులలో ఇప్పటికే రూ.477 కోట్ల ను రైతుల ఖాతాలో జమ చెయ్యడం జరిగిందని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన 48 గంటలలోపు రైతుల ఖాతాల లోకి డబ్బు జమ అవుతోందన్నారు. .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Grain procurement in Rabi

You cannot copy content of this page

Scroll to Top