త్రినేత్రం న్యూస్ : కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రి, నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, ఎమ్మెల్యే లు,ఎంపీ లతో రివ్యూ మీటింగ్ లో ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ…
గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు విధానంలో అనేక తప్పులు జరిగి రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతులు ఇబ్బందులు పడకూడదని చంద్రబాబు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు జరగాలనేదే నా ఉద్దేశ్యం, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులపై అధ్యయనం చేయడం కోసం చంద్రబాబు గారు వేసిన స్టీరింగ్ కమిటీలో నేను సభ్యుడిని,
ఆనాడు రాష్ట్రమంతా పర్యటించి చంద్రబాబు,కి నివేదిక ఇచ్చిన తర్వాత వారు వివిధ సభలలో “రైతు పండించిన ప్రతీ ధాన్యం గింజని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతుకి ఎక్కడ రైస్ మిల్ అనుకూలంగా ఉంటే అక్కడ ధాన్యం అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తాం” అని హామీ ఇవ్వడం జరిగింది.
అవి క్షేత్రస్ధాయిలో అమలు అవుతున్నాయో లేదో ఒకసారి సమీక్షించుకోవాలి, గత సీజన్ లో చంద్రబాబు గారు హామీ ఇచ్చిన విధంగా సీఎంర్ కి అమ్మిన ధాన్యం డబ్బులు 48 గంటలు అని చెపితే 24 గంటలలోపే జమ కావడం హర్షణీయం, కానీ నేడు మరలా రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉంది. తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.
రైస్ మిల్లులు అధికంగా ఉన్న అనపర్తి మండలం పొలమూరులో ధాన్యం కొనుగోలు సరిగా లేదంటూ ఇపుడే సమాచారం అందించారు. కొంటే రూ 1500 కే అడుగుతున్నారు. రైతులు మొత్తం ధాన్యం రాశులను రోడ్డు మీదనే పెట్టుకుని దిక్కులు చూస్తున్నారని సమాచారం వచ్చింది.
మరో ప్రక్క వర్షం కారణంగా మరింత ఇబ్బందులు వస్తున్నాయి. తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయవలసి ఉంది. గత పదిరోజులు గా ప్రతీరోజూ వర్షం కురుస్తుంది. దాంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ధాన్యాన్ని రైతులు వెంటనే అమ్ముకోవాలని చూస్తున్నందునే సమస్య వస్తుందని అధికారులు చెపుతున్నారు కానీ పొలంలో నుండి బయటకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అమ్మాల్సిన పరిస్దితి రైతుది.
రైతు సేవా కేంద్రాలలో టార్గెట్లు లేవని వారే బయట మార్కెట్ లో అమ్ముకోమని ప్రోత్సహిస్తున్నారు.
తప్పు రైస్ మిల్లర్స్ దా? అధికారులదా? అని భేరీజు వేసుకోవాలి.
ఇక తూర్పుగోదావరి జిల్లాలో అధికారులు స్పందిస్తున్న తీరు సరిగా లేదు. రైతుల దగ్గర నుండి వచ్చే సమస్యలను జాయింటు కలెక్టరు,కి తీసుకెళ్ళిన ప్రతీసారీ ఆయన చేసేద్దాం అంటారు తప్ప ఆచరణలో జరగడం లేదు. ఇక్కడ విభజించు, పాలించు విధానాన్ని అధికారులు అమలు చేస్తున్నారు. మంత్రిగారు దీనిపై దృష్టి సారించాలి.
కాకినాడ జిల్లా రైతులకు బిక్కవోలు, పందలపాక తదితర ఏరియాల రైస్ మిల్లులు అతి తక్కువ దూరంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనల కారణంగా వారు పాతిక, మప్పై కి.మీ దూరంలో ఉన్న పెద్దాపురం తదితర ఏరియాలకు వెళ్ళి అమ్మాల్సి వస్తుంది.
దానిని సడలించి బిక్కవోలు మండలంలో అమ్ముకునే వెసులుబాటు కల్పించమని మొదటి సమావేశంలోనే నేను మంత్రిగారిని వేదికపైన మరియు పర్సనల్ గా కూడా అడగటం జరిగింది. ఆరోజు మంత్రి, యంపి, కలెక్టరు, అందరూ భరోసా ఇచ్చారు గానీ అమలు జరుగలేదు. గత సీజన్ లోనూ లేదు ఇపుడూ లేదు.
నేను గత శాసనసభ సమావేశాలలో కూడా ప్రస్తావించాను కానీ అమలు జరుగలేదు.
ఎందుకు అశ్రద్ద జరుగుతుందో మంత్రిగారు దృష్టి సారించాలి. క్షేత్రస్ధాయిలో కొంతమంది అధికారులు చేస్తున్న తప్పిదాల వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.
శాసనసభ్యునిగా నేను దీన్ని ఎంతమాత్రం సహించేది లేదు. రైతుకి మేలు జరగాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


